మన తెలుగు సినిమాలలో నార్త్ ఇండియన్ హీరోయిన్లు నటించడమే తప్ప సొంతంగా డబ్బింగ్ చెప్పుకోరు. కానీ ప్రస్తుతం కొంత మంది కథానాయికలు వారి సినిమాలకు సొంత డబ్బింగ్ చెప్పుకోవడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే నిత్యా మీనన్, తాప్సీ, సమంత మరియు నయనతార తమ సినిమాలకు డబ్బింగ్ చెబుతుండగా కొత్తగా వీరి జాబితాలో రిచా పనాయ్ వచ్చి చేరింది. ఈ భామ ఎవరా అనుకుంటున్నారా? ఈ అందాల భామ మన కామెడీ కింగ్ అల్లరి నరేష్ ‘యముడికి మొగుడు’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. స్వతహాగా నార్త్ ఇండియన్ అయిన రిచా వ్రుత్తి పట్ల ఉన్న గౌరవంతో తన పాత్రకి సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే పలు మళయాళ సినిమాల్లో నటించిన రిచాకి ఇది మొదటి తెలుగు సినిమా. తెలుగు సరిగ్గా రాకపోయినా తన మొదటి సినిమాతో డబ్బింగ్ చెప్పడానికి ముందుకు వచ్చిన రిచాని మెచ్చుకొనే తీరాలి. ఈ సోషియో ఫాంటసీ సినిమాలో యమధర్మ రాజు కూతురి పాత్రలో రిచా కనిపించనుంది. యమధర్మ రాజు పాత్రలో సాయాజీ షిండే నటిస్తుండగా, అతని భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించారు. అల్లరి నరేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమాతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఇ. సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు మరియు చంటి అడ్డాల నిర్మిస్తున్నారు.
సొంతంగా డబ్బింగ్ చెప్పుకోనున్న మరో నార్త్ హీరోయిన్
సొంతంగా డబ్బింగ్ చెప్పుకోనున్న మరో నార్త్ హీరోయిన్
Published on Oct 28, 2012 2:30 PM IST
సంబంధిత సమాచారం
- బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం.. సౌత్ ఇండియా నుంచి ఒకే ఒక్కడు..!
- సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ‘మిరాయ్’.. రన్ టైమ్ ఎంతంటే..?
- ఆంధ్ర కింగ్ తాలూకా : క్యాచీగా ‘పప్పీ షేమ్’ సాంగ్.. రామ్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్..!
- పోల్ : ఈ వారం రిలీజ్ కానున్న సినిమాల్లో మీరు ఏది చూడాలనుకుంటున్నారు..?
- థియేటర్/ఓటీటీ : ఈ వారం సందడి చేయబోయే సినిమాలివే..!
- రవితేజ 76 మూవీ.. అప్పుడే అవి క్లోజ్..!
- ‘లిటిల్ హార్ట్స్’ వసూళ్లు.. ఇది కదా కావాల్సింది..!
- ‘మల్లెపూల’ పంచాయితీ.. లక్షకు ఎసరు..!
- ఓజి కోసం థమన్ డెడికేషన్.. 117 మందితో మ్యూజిక్ రికార్డింగ్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- SSMB29 ఎపిక్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా..?
- మిరాయ్ తో తేజ సక్సెస్ కంటిన్యూ చేస్తాడా?
- రజిని, కమల్ సెన్సేషనల్ మల్టీస్టారర్ పై కమల్ బిగ్ అప్డేట్!
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో మలయాళ మెగాస్టార్స్!
- అమెరికా గడ్డపై 40 వేల టికెట్స్ తో ‘ఓజి’ ర్యాంపేజ్!
- క్రేజీ బజ్.. మహేష్ 29 ఫస్ట్ లుక్ ఒకటే కాదు.. అంతకు మించి ప్లాన్ చేసిన జక్కన్న?
- ఓటిటి సమీక్ష: ‘మౌనమే నీ భాష’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- వైరల్ పిక్: ‘ఇంద్ర’ సెట్స్ లో బాలయ్య సందడి చూసారా?