రవితేజ “బలుపు” మొదలయ్యింది

రవితేజ “బలుపు” మొదలయ్యింది

Published on Oct 25, 2012 10:24 PM IST


మాస్ మహారాజ రవితేజ మరియు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న చిత్రం “బలుపు”. ఈ చిత్రం ఈరోజు ప్రారంభం అయ్యింది నిర్మాత ప్రసాద్ పోట్లురి ఆఫీస్లో ఈ చిత్రాన్ని లాంచనంగా ప్రారంభించారు. ఈ చిత్రంలో శృతి హాసన్ ప్రధాన కథానాయిక కాగా అంజలి రెండవ కథానాయికగా కనిపించనుంది. గతంలో రవితేజ మరియు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో “డాన్ శీను” చిత్రం వచ్చింది. కోన వెంకట్ ఈ చిత్రానికి కథ అందించగా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పివిపి బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. తెలుగు మరియు తమిళంలో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యనున్నారు.

తాజా వార్తలు