యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం తన కెరీర్‌లోని 22వ చిత్రంలో నటిస్తున్నాడు. దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారు. అందాల భామ భాగ్యశ్రీ బొర్సె ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. RAPO22 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను మే 15న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. దీనికి సంబంధించి రామ్ తాజాగా డబ్బింగ్ కూడా పూర్తి చేశాడు.
దీంతో ఈ టైటిల్ గ్లింప్స్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.