‘వార్-2’ ట్రైలర్.. ఇన్‌సైడ్ టాక్ ఏమిటో తెలుసా?

‘వార్-2’ ట్రైలర్.. ఇన్‌సైడ్ టాక్ ఏమిటో తెలుసా?

Published on Jul 25, 2025 3:00 AM IST

war2-telugu

బాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘వార్ 2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను జూలై 25న రిలీజ్ చేస్తుండటంతో ఈ ట్రైలర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను వీక్షించిన సినీ సర్కిల్స్‌లో ఈ ట్రైలర్‌పై ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ ట్రైలర్ పూర్తి యాక్షన్ ట్రీట్‌గా ఉండబోతుందని.. ఇది మాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ఫీస్ట్ అందిస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ చిత్రాన్ని ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు