‘వార్ 2’ ట్రైలర్ పైనే అందరి కళ్ళు!

‘వార్ 2’ ట్రైలర్ పైనే అందరి కళ్ళు!

Published on Jul 25, 2025 7:00 AM IST

war2 movie

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రమే “వార్ 2”. గట్టి హైప్ సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పుడు గ్రాండ్ థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ ట్రైలర్ పట్ల మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

నేడు గ్రాండ్ గా థియేటర్స్ సహా ఆన్లైన్ లో విడుదల కాబోతున్న ఈ సెన్సేషనల్ ట్రైలర్ పైనే అందరి కళ్ళు ఉన్నాయి. మొన్న వచ్చిన టీజర్ కంటే ఈ ట్రైలర్ నుంచి మరింత బ్లాస్టింగ్ ట్రీట్ ని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ పదిన్నరకి రాబోతున్న ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు