టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం SSMB29 ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాను పూర్తి అడ్వెంచర్ థ్రిల్లర్‌గా జక్కన్న రూపొందిస్తున్నాడు.
కాగా ఈ సినిమాలో కీలక పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. తాజాగా ఆయన ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా SSMB29 గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటివరకు ఏ డైరెక్టర్ కూడా తెరకెక్కించని రీతిలో రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడని.. ఇలాంటి సినిమాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి అని.. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుందని పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నారు.
ఇలా తమ నెక్స్ట్ సినిమాపై పృథ్వీరాజ్ సుకుమార్ చేసిన కామెంట్స్‌తో SSMB29 మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది.