హాలీవుడ్‌లో తెరకెక్కిన ఫ్రాంచైజీ చిత్రాల్లో స్పై యాక్షన్ థ్రిల్లర్ మిషన్ ఇంపాసిబుల్ కూడా ఒకటి. ఈ ఫ్రాంచైజీలో రీసెంట్‌గా వచ్చిన చిత్రం ‘మిషన్ ఇంపాసిబుల్ ది ఫైనల్ రెకనింగ్’ మే 17న థియేటర్లలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో టామ్ క్రూజ్ మరోసారి తనదైన యాక్షన్ స్టంట్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.
దర్శకుడు క్రిస్టోఫర్ మెక్ క్వారీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా 589 మిలియన్ డాలర్ల బాక్సాఫీస్ వసూళ్లు రాబట్టింది. ఇలాంటి సినిమా ఇప్పుడు ఓటీటీలో వస్తుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు యాపిల్ టీవీలో స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 19 నుంచి ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
మరి ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ ప్రియులను థ్రిల్ చేసిన ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్‌ను ఎంతమేర ఇంప్రెస్ చేస్తుందో చూడాలి.