సమీక్ష: ‘హరిహర వీరమల్లు – పార్ట్ 1’ – ఆకట్టుకునే పీరియాడిక్ యాక్షన్ డ్రామా

సమీక్ష: ‘హరిహర వీరమల్లు – పార్ట్ 1’ – ఆకట్టుకునే పీరియాడిక్ యాక్షన్ డ్రామా

Published on Jul 25, 2025 3:01 AM IST

Hari Hara Veera Mallu

విడుదల తేదీ : జూలై 24, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునీల్, రఘుబాబు తదితరులు.
దర్శకుడు : క్రిష్ జాగర్లమూడి – జ్యోతికృష్ణ
నిర్మాణం : మెగా సూర్య ప్రొడక్షన్స్
సంగీతం : ఎం ఎం కీరవాణి
సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్
ఎడిటింగ్ : ప్రవీణ్ కే ఎల్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లాంగ్ అవైటెడ్ చిత్రమే ‘హరిహర వీరమల్లు’. రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమా తాలూకా మొదటి భాగం చివరి నిమిషంలో భారీ హైప్ ని అందుకొని విడుదలకి వచ్చింది. మరి ఈ సినిమా ఆ అంచనాలు రీచ్ అయ్యిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం రండి.

కథ:

అది 1650 కొల్లూరు ప్రాంతం అప్పటికే మొగులుల ఆధిపత్యంలో భారతీయులు నలుగుతున్న సమయం అక్కడ దొరికిన అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని సమస్త భారతదేశాన్ని తన మతంలోకి మారితే తప్ప బ్రతుకు లేదంటే చావు అనే అత్యంత క్రూరుడు ఔరంగజేబు వశం చేసుకుంటాడు. అయితే దీనిని తీసుకురాగిలిగే సత్తా ఒక తెలివైన వజ్రాల చోరుడు హరిహర వీరమల్లు (పవన్ కళ్యాణ్) సొంతం అని గోల్కొండని పాలిస్తున్న కుతుబ్ షా (దలీప్ తహిల్) వీరని తన దగ్గరకి రప్పించుకొని అత్యంత కష్టతరమైన కార్యాన్ని అప్పజెపుతాడు. మరి ఇక్కడ నుంచి వీరమల్లు ఎలా సవాళ్ళని ఎదుర్కొన్నాడు? అసలు ఈ వీరమల్లు ఎవరు? అతని గతం ఏంటి? వీరమల్లు నిజంగానే కోహినూర్ కోసం వచ్చాడా లేక ఔరంగజేబుతో మరో బలమైన కారణం ఉందా? అదేంటో తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఇన్నాళ్లు అభిమానులు ఎదురు చూసిన ఎదురు చూపులకి బిగ్ స్క్రీన్స్ పై వీరమల్లు తాండవం ఫుల్ మీల్స్ పెడుతుంది అని చెప్పవచ్చు. ఊహించని ఎలివేషన్లు క్రేజీ బాక్గ్రౌండ్ స్కోర్ లతో సినిమా మాస్ ట్రీట్మెంట్ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పై ప్రతీ సీన్ కూడా ఎంజాయ్ చేసే విధంగా తీర్చిదిద్దారు.

సందర్భానుసారంగా వచ్చే పాటలు కానీ ఫైట్స్ కానీ తీసుకెళ్లిన కథనం మెప్పిస్తాయి. అలాగే క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ పోర్షన్స్ కూడా హైలైట్ అని చెప్పవచ్చు. సనాతన ధర్మం కోసం జరిగే పోరాటం అప్పట్లో జరిగిన కొన్ని దారుణ ఉదంతాలు కళ్ళకి కట్టినట్లు చూపించారు. ఎమోషనల్ ఇవి బాగా వర్కవుట్ అయ్యాయి.

ఇక నటీనటులు విషయానికి వస్తే.. నిర్మాత ఏ ఎం రత్నం ఓ సందర్భంలో చెప్పినట్లు పవన్ కళ్యాణ్ నిజంగానే తన విశ్వరూపం చూపించారని చెప్పవచ్చు. తన గడిచిన నాలుగైదు సినిమాల్లో కూడా చూడని కొత్త పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో ఆడియెన్స్ చూస్తారు. యాక్షన్ బ్లాక్ లలో పవర్ స్టార్ తన మార్క్ చూపించి మెస్మరైజ్ చేసారు. కొన్ని కొన్ని చాలా సింపుల్ గా చేసేసారు కానీ ఈ సినిమాకి మాత్రం తనలోని కష్టం ఇష్టం రెండూ కనిపిస్తాయి.

ఇక నిధి అగర్వాల్ తన రోల్ లో చాలా బావుంది. ఆమెపై ఓ ట్విస్ట్ ఆడియెన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంది. ఇక వీరితో పాటుగా ఆద్యంతం ఉన్న నటీనటులు రఘుబాబు, సునీల్, నాజర్ అలాగే సుబ్బరాజు తదితరులు నవ్వించారు. తమ పాత్రల్లో మెప్పించారు.

ఇక ఫైనల్ గా ఔరంగజేబు నటుడు బాబీ డియోల్ నుంచి మరో పవర్ఫుల్ నెగిటివ్ రోల్ ఇది అని చెప్పవచ్చు. ఛావాలో కూడా ఒక ఔరంగజేబుని చూసాం బాబీ ఎలా ఉంటాడో అనేవారికి సమాధానం తను ఈ సినిమాలో అందించారు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో మంచి పాయింట్ ఉంది దానికి అనుగుణంగా అల్లుకున్న కథనం కూడా ఓకే కానీ కొన్ని చోట్ల కథనం మాత్రం ఒకింత ఊహాజనిత తరహాలోనే కొనసాగుతుంది. అలాగే సెకండాఫ్ లో మాత్రం మాస్ అండ్ ఎలివేషన్ మూమెంట్స్ కొంచెం డల్ అయ్యాయి.

ఫస్టాఫ్ లో మెయింటైన్ చేసిన రేంజ్ లో సెకండాఫ్ ని కూడా మొదటి కొంతసేపు కొనసాగించి ఉంటే బాగుండేది. ఇక వీటితో పాటుగా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ దారుణంగా ఉన్నాయి. అక్కడ జరిగే సన్నివేశం ఏంటి దానికి చూపించే విజువల్స్ కి అసలు పొంతన లేదు. సెకండాఫ్ లో ఒక్క క్లైమాక్స్ మినహా మిగతా పోర్షన్స్ గ్రాఫిక్స్ చాలా వీక్ గా ఉన్నాయి. ఇంత సమయం తీసుకున్నప్పటికీ మేకర్స్ మంచి విజువల్స్ అందించలేకపోయారు.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు కొన్ని అంశాల్లో చాలా బాగున్నాయి ఇంకొన్ని అంశాల్లో వీక్ గా ఉన్నాయని చెప్పక తప్పదు. గ్రాండియర్ పీరియాడిక్ డ్రామాకి తగ్గట్టుగా చేసుకున్న ప్రొడక్షన్ డిజైన్ కానీ భారీ సెట్టింగ్స్ గాని చాలా బాగున్నాయి కానీ విజువల్ ఎఫెక్ట్స్ వీక్ గా ఉన్నాయి. ఇక టెక్నీషియన్స్ లో మొదటిగా చెప్పాల్సింది ఆస్కార్ విజేత కీరవాణి కోసమే.. సందు దొరికినప్పుడల్లా తన స్కోర్ తో సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. అలా సినిమా మొత్తం ఇదే మూమెంటం కొనసాగిస్తారు. అలాగే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పవన్ పై మంచి విజువల్స్ ని చూపించారు. ఎడిటింగ్ సెకండాఫ్ లో కొంచెం చూసుకోవాల్సింది. ఇక దర్శకులు క్రిష్, జ్యోతికృష్ణలు ఈ సినిమాకి మంచి వర్క్ అందించారు. ఇద్దరూ కథనాన్ని మంచి ఎంగేజింగ్ మూమెంట్స్ తో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే సెకండాఫ్ కథనంలో కొంతమేర ఎక్కువ దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండేది.

తీర్పు:

ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే “హరిహర వీరమల్లు” సనాతన ధర్మం కాపాడుకోవడం కోసం పోరాడే పవర్ స్టార్ తాండవం అని చెప్పవచ్చు. పీరియాడిక్ ప్రపంచంలోకి తీసుకెళ్లడమే కాకుండా తనపై మంచి ఎమోషన్ తో కలిగిన సాలిడ్ హై మూమెంట్స్, ఎలివేషన్లు అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లు వెన్నుముకగా నిలిచాయి. సెకాండఫ్ లో కొన్ని చోట్ల సో సో మూమెంట్స్, డిజప్పాయింట్ చేసే విఎఫ్ఎక్స్ లు పక్కన పెడితే మిగతా ఎలిమెంట్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. సో వీటితో వీరమల్లు పార్ట్ 1 ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు