ఇద్దరు బాలీవుడ్ విలన్స్ తో తలపడనున్న రామ్ చరణ్.!

ఇద్దరు బాలీవుడ్ విలన్స్ తో తలపడనున్న రామ్ చరణ్.!

Published on Oct 26, 2012 3:40 PM IST


మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా అరంగేట్రం చేసి రెండవ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. 1973 లో అమితాబ్ బచ్చన్ హీరోగా వచ్చిన ‘జంజీర్’ సినిమా రిమేక్ తో రామ్ చరణ్ బాలీవుడ్లో అరంగేట్రం చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రంలో కీలక పాత్ర షేర్ ఖాన్. ఈ పాత్రకి మొదటగా సంజయ్ దత్ ని అడిగారు ఆయన డేట్స్ లేవని కుదరదు అన్నారు, ఆ తర్వాత సోనూ సూద్ ను తీసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం సంజయ్ దత్ ఈ షేర్ ఖాన్ పాత్ర చేయడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు హిందీ వెర్షన్లో సంజయ్ దత్ ని మరియు తెలుగు వెర్షన్లో సోనూ సూద్ లు షేర్ ఖాన్ పాత్రల్లో కనిపించనున్నారు. ఒకే సినిమా కోసం రామ్ చరణ్ ఇద్దరు బాలీవుడ్ విలన్స్ తో తలపడనున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. హిందీ వెర్షన్ కి అపూర్వ లిఖియా దర్శకత్వం వహిస్తుండగా, తెలుగు వెర్షన్ కి యోగి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి యంగ్ తరంగ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు