హృతిక్ క్రిష్ 4 అప్డేట్..!

హృతిక్ క్రిష్ 4 అప్డేట్..!

Published on Apr 13, 2020 8:22 PM IST

బాలీవుడ్ లో భారీ క్రేజ్ ఉన్న సూపర్ హీరో మూవీ క్రిష్ . హృతిక్ రోషన్ హీరోగా 2003లో వచ్చిన కోయీ మిల్ గయా చిత్రంతో మొదలైన ఈ ఫ్రాంచైజ్ నుండి ఇప్పటికి మూడు పార్ట్స్ వచ్చాయి. 2006లో క్రిష్ రాగ ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంకా చోప్రా నటించింది. 2013లో క్రిష్ 3 విడుదల కాగా అందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, కంగనా రనౌత్ విలన్ రోల్ చేయడం జరిగింది. ఈ సక్సెస్ ఫుల్ సిరీస్ క్రిష్ 4 గురించి దర్శక నిర్మాత రాకేష్ రోషన్ ని అడుగగా మూవీపై అప్డేట్ ఇచ్చారు.

క్రిష్ 4 కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం ఇప్పుడు స్క్రిప్ట్ దశలో ఉంది. కరోనా వైరస్ కర్ఫ్యూ ముగిసిన వెంటనే మిగతా కార్యక్రమాలు ఊపందుకుంటాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్ ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు అని అన్నారు. అలాగే గత ఏడాది హృతిక్ రోషన్ చేసిన సూపర్ 30, వార్ చిత్రాల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. వార్ 2019 బాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు