యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాతో తన కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. అయితే, ఆ సినిమా తర్వాత ‘దిల్రూబా’ అనే ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు. ఈ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి. కానీ, ఈ రెండు సినిమాల ప్రొడక్షన్‌కు చాలా సమయం పట్టింది. ఇక ఇప్పుడు ఈ హీరో ‘K ర్యాంప్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తికాకముందే, తన నెక్స్ట్ చిత్రంగా ‘చెన్నై లవ్ స్టోరీ’ని ఇటీవల అనౌన్స్ చేశాడు.
అయితే, సినిమాలను అనౌన్స్ చేయడం ఓకే కానీ.. ఈ సినిమాలను పూర్తి చేసేందుకు ఆయన చాలా టైమ్ తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ హీరోలు మొదలుకొని, ఇలా మీడియం రేంజ్ హీరోల వరకు ఒక్కో సినిమాకు ఇంతేసి సమయం తీసుకుంటే థియేటర్లలో సినిమాల రిలీజ్లు లేక ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఇబ్బందులు పడుతున్నారని పలువురు క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. థియేటర్లను ముందుకు నడిపించేది మిడ్ రేంజ్ సినిమాలే అని.. ఇలా కిరణ్ అబ్బవరం లాంటి హీరో కూడా ఒక్కో సినిమాకు రెండేళ్ల సమయం తీసుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదని పలువురు కామెంట్ చేస్తున్నారు.
ఇప్పటికైనా కిరణ్ అబ్బవరం లాంటి మిడ్ రేంజ్ హీరోలు గేరు మార్చి స్పీడ్ పెంచాలని వారు కోరుతున్నారు. మరి ఈ కామెంట్స్ పై కిరణ్ అబ్బవరం ఏమైనా స్పందిస్తాడా.. అనేది వేచి చూడాలి.