‘కింగ్’ నాగార్జున ల్యాండ్‌మార్క్ 100వ మూవీకి పెద్ద ప్లానింగే..?

‘కింగ్’ నాగార్జున ల్యాండ్‌మార్క్ 100వ మూవీకి పెద్ద ప్లానింగే..?

Published on Jun 13, 2025 1:01 AM IST

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ఆయన ప్రస్తుతం ‘కుబేర’, ‘కూలీ’ చిత్రాల్లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత ఆయన తన కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ మూవీపై ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

నాగార్జున కెరీర్‌లో 100వ చిత్రాన్ని ఆయన త్వరలోనే ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను తొలుత తమిళ డైరెక్టర్ నవీన్ తెరకెక్కిస్తాడనే వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పుడు మరో తమిళ దర్శకుడు కార్తీక్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాను నాగార్జున కెరీర్‌లోనే ప్రత్యేక సినిమాగా ఆయన మలిచేందుకు సిద్ధమవుతున్నాడట.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ సాలిడ్ అప్డేట్‌ను నాగార్జున పుట్టినరోజు ఆగస్టు 29న రివీల్ చేస్తారనే టాక్ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. దీంతో అక్కినేని అభిమానులు, కింగ్ అభిమానులు నాగ్ 100వ చిత్రం కోసం ఇప్పటినుంచే ఆసక్తిగా చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు