‘మాస్ జాతర’ చూసి షాక్ అవుతారు – రాజేంద్ర ప్రసాద్

‘మాస్ జాతర’ చూసి షాక్ అవుతారు – రాజేంద్ర ప్రసాద్

Published on Oct 29, 2025 12:31 AM IST

Rajendra Prasad

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న పెయిడ్ ప్రీమియర్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను భాను బోగవరపు డైరెక్ట్ చేస్తుండగా ఈ చిత్రంతో మాస్ రాజా సాలిడ్ సక్సెస్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.

ఇక ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో తన పాత్ర అందరినీ షాక్ చేస్తుందని.. తనను ఇలాంటి పాత్రలో ఊహించరు అని.. తన పాత్ర సర్‌ప్రైజ్ చేయకపోతే తాను సినిమాలు మానేస్తానని రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ చేశారు.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు