ఇద్దరు స్టార్స్ రిజెక్ట్ చేశారు.. పవన్ ఓకే చేస్తాడా..?

ఇద్దరు స్టార్స్ రిజెక్ట్ చేశారు.. పవన్ ఓకే చేస్తాడా..?

Published on Oct 28, 2025 6:30 PM IST

Pawan-Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా ‘ఓజీ’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకుడు సుజీత్ డైరెక్ట్ చేయగా ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఇప్పుడు పవన్ తన నెక్స్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, ఈ సినిమా తర్వాత మరో సినిమాను లైన్‌లో పెట్టేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నట్లు సినీ సర్కిల్స్ టాక్.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం తర్వాత తన నెక్స్ట్ చిత్రం కోసం పవన్ కథలను వింటున్నాడట. ఈ క్రమంలోనే దర్శకుడు వంశీ పైడిపల్లి ఆయనకు ఓ కథను వినిపించినట్లు తెలుస్తోంది. మంచి సోషల్ డ్రామా చిత్రంగా ఇది ఉండటంతో పవన్ ఆసక్తిని చూపాడట. అయితే, ఈ కథను బాలీవుడ్‌లో ఇద్దరు స్టార్స్ రిజెక్ట్ చేయడం గమనార్హం.

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తొలుత ఈ సినిమాకు ఓకే చెప్పాడు. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇక మరో హీరో సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమా కథను విని రిజెక్ట్ చేశాడట. మరి ఇలా ఇద్దరు స్టార్స్ రిజెక్ట్ చేసిన సినిమాకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

తాజా వార్తలు