ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని AA22 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో సరికొత్త బజ్ ఒకటి చక్కర్లు కొడుతోంది.
ఈ ప్రెస్టీజియస్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ దీపిక పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెతో పాటు మరికొంత మంది కూడా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారట. అయితే, తాజాగా ఈ చిత్ర షూటింగ్‌లో అందాల భామ మృణాల్ ఠాకూర్ జాయిన్ అయ్యిందని.. ఆమె కొన్ని సీన్స్ కూడా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో నిజంగానే ఈ సినిమాలో మృణాల్ నటిస్తుందా.. నిజంగానే ఆమె సెట్స్‌లో జాయిన్ అయిందా..? అనే ప్రశ్నలు అభిమానుల్లో రేకెత్తిస్తున్నాయి.


