రిలీజ్ ముంగిట వాయిదా పడ్డ ‘ఆర్యన్’ మూవీ!

రిలీజ్ ముంగిట వాయిదా పడ్డ ‘ఆర్యన్’ మూవీ!

Published on Oct 29, 2025 2:00 AM IST

తమిళ హీరో విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ “ఆర్యన్” గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను ప్రవీణ్ కె డైరెక్ట్ చేయగా విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మాణంలో శుభ్ర మరియు ఆర్యన్ రమేశ్ సహ నిర్మాణంలో రూపొందింది. ఈ చిత్రం తొలుత అక్టోబర్ 31న తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కావాల్సి ఉంది.

అయితే తాజా సమాచారం ప్రకారం, తెలుగు విడుదల వాయిదా పడింది. ఇప్పుడు తెలుగు డబ్ వెర్షన్ నవంబర్ 7, 2025న థియేటర్లలోకి రానుంది. విష్ణు విశాల్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆయనకు రవితేజ మరియు ఎస్‌.ఎస్‌. రాజమౌళి పట్ల గల గౌరవమే అని తెలుస్తోంది. ఈ వారం విడుదలవుతున్న ‘మాస్ జాతర’ మరియు ‘బాహుబలి : ది ఎపిక్’ సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

తాజా వార్తలు