ఈసారి కొడుతున్నాం – రవితేజ

ఈసారి కొడుతున్నాం – రవితేజ

Published on Oct 29, 2025 1:02 AM IST

మాస్ రాజా రవితేజ నటించిన యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ “మాస్ జాత్రా” ట్రైలర్‌ విడుదలతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో రవితేజ మాట్లాడుతూ..“తమ్ముళ్లూ, ఇటీవల నా సినిమాలు మీ అంచనాలను అందుకోలేదని నాకు తెలుసు. కానీ మాస్ జాతరతో అలాంటిదేమీ జరగదు. ఇది నా హామీ” అని అన్నారు.

తన నుంచి వచ్చిన రీసెంట్ చిత్రాలు అభిమానులను అలరించలేకపోయాయని.. అందుకే ఈసారి గట్టిగా హిట్ కొడుతున్నామని ఆయన కాన్ఫిడెంట్‌గా చెప్పారు.

తాజా వార్తలు