రష్మిక మందన్న నటించిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా “ది గర్ల్ ఫ్రెండ్” రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నవంబర్ 7న విడుదల కానుంది. టాక్సిక్ రిలేషన్‌షిప్‌ల నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించాడు.
అయితే, ఈ సినిమాలో హీరో ఎంపికపై రాహుల్ రవీంద్రన్ తాజాగా మాట్లాడుతూ.. “దసరా మూవీ సమయంలో దీక్షిత్ చాలా షార్ప్‌గా కనిపించాడు. నటుడు ఏ ఇండస్ట్రీకి చెందినవాడన్నది ముఖ్యం కాదు, కానీ తెలుగు డైలాగులు మాట్లాడాలి” అన్నారు.
‘ఈ సినిమాలో హీరో పాత్ర కూడా హీరోయిన్ కంటే ప్రాధాన్యం కలిగి ఉంది. నాకు పర్ఫార్మర్ కావాలి. స్టార్ హీరోలు తమ మార్కెట్‌కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం సహజం. అందుకే దీక్షిత్ శెట్టిని ఎంపిక చేశాను’ అని తెలిపారు.


