‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ లాంఛ్: హీరో తిరువీర్‌పై ప్రశంసలు కురిపించిన సినీ ప్రముఖులు

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ లాంఛ్: హీరో తిరువీర్‌పై ప్రశంసలు కురిపించిన సినీ ప్రముఖులు

Published on Oct 28, 2025 5:00 PM IST

తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్ర ట్రైలర్‌ను మంగళవారం నాడు హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖులు ఘనంగా విడుదల చేశారు. నవంబర్ 7న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు దర్శకులు కరుణ కుమార్, యదు వంశీ, ఆదిత్య హాసన్, రామ్ అబ్బరాజు, సన్నీ, దుశ్యంత్, ఉదయ్ గుర్రాల, రూపక్, తేజ, నంద కిషోర్ వంటి ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ, “తిరువీర్ గొప్ప నటుడు. తల్లి మరణించినా ఆ విషయాన్ని చెప్పకుండా ‘పలాస’ షూటింగ్‌లో పాల్గొని తన అంకితభావాన్ని చాటుకున్నారు. రూటెడ్ కథలతో వస్తున్న ఈ చిత్రం వంద శాతం బ్లాక్ బస్టర్ అవుతుంది” అని ప్రశంసించారు. దర్శకులు రామ్ అబ్బరాజు, సన్నీ, రూపక్ సైతం ట్రైలర్ చాలా బాగుందని, ఇది ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా నవ్వుకునే స్వీట్, సింపుల్, సెన్సిబుల్ కామెడీ ఎంటర్‌టైనర్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

హీరో తిరువీర్ మాట్లాడుతూ, ఇంతమంది దర్శకుల మద్దతు లభించడం సంతోషంగా ఉందని, ఈ సినిమా కథ విన్నప్పుడు తాను నవ్వుతూనే ఉన్నానని తెలిపారు. చిత్రీకరణ ఒక టూర్ లాగా సరదాగా జరిగిందని, మంచి కంటెంట్‌తో తమ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ప్రేక్షకుల ముందుకు వస్తుందని అన్నారు. దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ట్రైలర్‌కు వంద రెట్లు సినిమా బాగుంటుందని, తిరువీర్ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో హీరో అని పేర్కొన్నారు. సందీప్ అగరం, అశ్మితా రెడ్డి బై 7PM, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రానికి కల్పనా రావు సహ నిర్మాత.

తాజా వార్తలు