రిచాని ‘సునో సనోరిటా’ అంటున్న ప్రభాస్

రిచాని ‘సునో సనోరిటా’ అంటున్న ప్రభాస్

Published on Oct 28, 2012 10:06 AM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘మిర్చి’ సినిమా చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. ప్రభాస్ సరసన అనుష్క మరియు రిచా గంగోపద్యాయ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే ఇటలీలో రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేసుకొని వచ్చిన ఈ టీం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో రిచా గంగోపాధ్యాయ- ప్రభాస్ మీద ‘సునో సనోరిటా’ అనే పాటను చిత్రీకరిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా రాజుసుందరం కొరియోగ్రఫీ చేస్తున్నారు. వంశీకృష్ణా రెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని 2013 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు