‘బాహుబలి’ని కట్టప్ప చంపకపోయి ఉంటే.? ప్రభాస్, రానాల ఫన్నీ వార్ వైరల్

‘బాహుబలి’ని కట్టప్ప చంపకపోయి ఉంటే.? ప్రభాస్, రానాల ఫన్నీ వార్ వైరల్

Published on Jul 17, 2025 3:59 PM IST

Prabhas, rana

యావత్తు భారతదేశం సినిమా ఒకే ఒక్క సినిమా ప్రశ్న కోసం మాట్లాడుకున్నది ఏదన్నా ఉంది అంటే అది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే చెప్పాలి. బాహుబలి 1 తో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, ప్రభాస్ లు మిగిల్చిన సస్పెన్స్ అంతా ఇంతా కాదు. మరి ఒకవేళ బాహుబలిని కట్టప్ప చంపకపోయి ఉంటే? ఈ ప్రశ్ననే మేకర్స్ బాహుబలి రీరిలీజ్ కి ముందు వైరల్ చేస్తున్నారు.

దీనిపై రానా (భళ్లాల) ఏమంటున్నాడు?

బాహుబలి సోషల్ మీడియా హ్యాండిల్ ఈ ఆసక్తికర ప్రశ్న మొదలు పెట్టినప్పుడు భళ్లాలుడు కట్టప్ప చంపకపోయి ఉంటే నేనే చంపేవాడిని అంటూ సమాధానం ఇచ్చాడు.

ఇక ప్రభాస్ (బాహుబలి) వంతు

మరి రానా ఇచ్చిన సమాధానంకి ప్రభాస్ ఇచ్చిన రిప్లై వైరల్ గా మారింది. మీరిద్దరూ కాదు నేను ఇందుకోసమే చంపనిచ్చాను అంటూ బాహుబలి 2 సినిమా 1000 కోట్ల పోస్టర్ తో ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు.

ఇలా ఈ భారీ సినిమా నటులు సోషల్ మీడియాలో మంచి ఫన్ వార్ తో ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక ఈ అవైటెడ్ సినిమా అక్టోబర్ 31న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో విడుదల చేస్తున్నారు.

baahubali

సంబంధిత సమాచారం

తాజా వార్తలు