‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!

‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!

Published on Sep 11, 2025 8:59 AM IST

kantara chapter 1

ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘కాంతార 1’ కూడా ఒకటి. రిషబ్ శెట్టి హీరోగా తన దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ డివోషనల్ పీరియాడిక్ డ్రామా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మేకర్స్ ఈ సినిమా గ్లోబల్ లెవెల్లో ప్లాన్ చేస్తుండగా ప్రస్తుతం రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాని భారీ మొత్తంతో అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఓటిటి హక్కులుగా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ప్రైమ్ వీడియో ఈ సినిమాని సొంతం చేసుకున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. అయితే ఇపుడు ఓ భారీ ఫిగర్ ఈ సినిమా విషయంలో వినిపిస్తుంది.

దీని ప్రకారం ప్రైమ్ వీడియో ఏకముగా 125 కోట్లు ఇచ్చి కాంతార 1 ని సొంతం చేసుకున్నారట. అయితే ఇది కేవలం సౌత్ భాషలు వరకు మాత్రమేనా హిందీ కూడా కలిపా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు