యూత్‌కు సినిమా కనెక్ట్ అయితే దాని ఫలితం వేరేలా ఉంటుంది. రీసెంట్గా రిలీజ్ అయిన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం ఇదే నిరూపించింది. దీంతో ఇప్పుడు మేకర్స్ అందరూ యూత్‌ని టార్గెట్ చేసుకుని సినిమాలు చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు అదే తరహా ఎంటర్టైన్మెంట్ను యంగ్ ఆడియన్స్‌కి అందించేందుకు వస్తోంది K-ర్యాంప్.
హీరో కిరణ్ అబ్బవరం ‘క’ తర్వాత నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే గ్లింప్స్‌తో మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్ యూత్‌ను ఆకట్టుకుంది. టీమ్ ఇంకా చాలా సర్ప్రైజ్లు దాచిపెట్టిందని చిత్ర వర్గాల సమాచారం. ఈ చిత్రంలో దాదాపు 18 లిప్‌లాక్ సీన్స్ ఉన్నాయట. ఇవి యూత్‌కు బాగా ెక్ట్ అయ్యేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయాలను ఒక్కొక్కటిగా వెల్లడిస్తారట మేకర్స్.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను సైతం నిర్మాత రాజేష్ దండా యూనిక్‌గా చేయాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే ఓటీటీ, డబ్బింగ్ డీల్స్ ఫైనల్ అయ్యాయని తెలుస్తోంది. దీపావళి సందర్భంగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో యూత్ ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించేందుకు కావాల్సిన అన్ని అంశాలు ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
ఈ సినిమాపై హీరో కిరణ్ అబ్బవరం కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఇక ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తుండగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను జైన్స్ నాని డైరెక్ట్ చేస్తున్నాడు.