టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సూపర్ యోధుడి పాత్రలో తేజ సజ్జా కనిపిస్తుండటంతో ఈ సినిమాలో అతడి నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా, ఈ సినిమాలో ఓ సాలిడ్ సర్‌ప్రైజ్ కూడా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో కొంత మైథాలజీ కూడా కనెక్ట్ అయి ఉండటంతో ఇందులో రాముడి పాత్ర ఉంటుందని.. ఆ పాత్రలో టాలీవుడ్ స్టార్ ఒకరు నటిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఆ స్టార్ మరెవరో కాదని.. టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి అని వార్తలు సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తుండగా రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుంది. గౌర హరి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.