ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రాల్లో కన్నడ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న సాలిడ్ ప్రాజెక్ట్ “కాంతార 1” కూడా ఒకటి. నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ డివోషనల్ డ్రామా గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు వస్తుంది.
అయితే పాన్ ఇండియా లెవెల్లో మంచి హైప్ ఉన్న ఈ సినిమాని గ్లోబల్ లెవెల్లో రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నట్టు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. నిజానికి కాంతార మొదటి సినిమానే మేకర్స్ ఇంగ్లీష్ లో కూడా ఓటిటి వరకు విడుదల చేశారు. తర్వాత ఇటాలియన్, స్పానిష్ లో కూడా రిలీజ్ చేశారు. ఇక దానికి ప్రీక్వెల్ ని ఇంగ్లీష్ థియేట్రికల్ గా కూడా చేస్తామని తెలిపారు.
కానీ ఇప్పుడు మరో టాక్ ఏమిటంటే వరల్డ్ వైడ్ గా కాంతార ఇంగ్లీష్ తో పాటుగా స్పానిష్ కూడా విడుదల కన్ఫర్మ్ అయ్యింది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ భాషల్లో సినిమా క్లిక్ అవుతుందా లేదా అనేది. చాలా వరకు పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేసిన భాషల్లో కూడా విడుదల కాలేదు. అలాంటిది వీరు ఈ భాషల్లో కూడా కాన్ఫిడెంట్ గానే ఉన్నట్టు తెలుస్తుంది. మరి కాంతార ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి.