సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’

సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’

Published on Sep 11, 2025 10:05 AM IST

Mirai-0

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా మంచు మనోజ్ విలన్ గా ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన భారీ చిత్రమే “మిరాయ్”. గట్టి హైప్ ఉన్న ఈ సినిమాని మేకర్స్ అదే రీతి ప్రమోషన్స్ చేసి తీసుకొస్తున్నారు. మరి ఈ సినిమా కోసం చూస్తున్న ఆడియెన్స్ కూడా సాలిడ్ బుకింగ్స్ ని అందిస్తున్నారు. ఆల్రెడీ బుక్ మై షోలో హవర్లీ ట్రెండింగ్ లో మిరాయ్ సత్తా చాటుతుంది.

నిన్నటి నుంచే మొదలైన ఈ మూమెంట్ నేడు కూడా కొనసాగుతుంది. దీనితో మిరాయ్ కి మాత్రం సాలిడ్ ఓపెనింగ్స్ గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రం ఏ లెవెల్ ఓపెనింగ్స్ సాధిస్తుందో చూడాలి మరి. ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్ గా నటించగా హను మాన్ సంగీత దర్శకుడు గౌర హరి సంగీతం అందించారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ సినిమాని నిర్మాణం వహించారు.

తాజా వార్తలు