సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో స్టార్స్ అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్ అలాగే మన టాలీవుడ్ కింగ్ నాగార్జున సాలిడ్ పాత్రల్లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కూలీ”. భారీ హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా వాటిని అందుకునే రేంజ్ టాక్ తెచ్చుకోకపోయినప్పటికీ రికార్డ్ వసూళ్లు సొంతం చేసుకుంది.
ఇక ఇలా థియేటర్స్ లో సాలిడ్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు వచ్చేసింది. ఈ సినిమా హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో కూలీ తమిళ్, తెలుగు, కన్నడ మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ సినిమా చూడాలి అనుకునేవారు ఇపుడు చూడొచ్చు. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి