‘హరిహర వీరమల్లు’లో కీరవాణి వర్క్ కి ఫ్యాన్స్ దాసోహం!

‘హరిహర వీరమల్లు’లో కీరవాణి వర్క్ కి ఫ్యాన్స్ దాసోహం!

Published on Jul 24, 2025 8:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం హరిహర వీరమల్లు కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు క్రిష్ స్టార్ట్ చేసిన సినిమాని జ్యోతిక్రిష్ణ ఎండ్ చేసాడు. ఇలా మంచి అంచనాలు నడుమ విడుదలకి వచ్చిన ఈ హిస్టారికల్ డ్రామా ఎట్టకేలకు థియేటర్స్ లోకి వచ్చి ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ అందించారు. అయితే థియేటర్స్ లో చూసిన ఆడియెన్స్ సహా అభిమానులు పవన్ కళ్యాణ్ కాకుండా ఒక్కరి వర్క్ కోసం గట్టిగా మాట్లాడుకుంటున్నారు.

మరి అది సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి వర్క్ కోసమే అని చెప్పాలి. సినిమా మొత్తం కీరవాణి చేసిన మాస్ డ్యూటీకి పవన్ అభిమానులు దాసోహం అయిపోయారు. నిజానికి చాలా మంది కీరవాణి నుంచి ఈ రేంజ్ మాస్ డ్యూటీని మాత్రం ఊహించలేదు. దీనితో ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్స్ లో కీరవాణి వర్క్ కి మంచి అప్లాజ్ దక్కింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు