ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రెడీ ?

ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రెడీ ?

Published on Apr 13, 2020 10:00 PM IST

‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రాబోతున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’లో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుంది ? మే 20న తారక్ బర్త్ డే రోజున తారక్ పాత్ర మీద జక్కన్న ఎలాంటి వీడియోను రిలీజ్ చేయనున్నాడు ? దర్శక ధీరుడు డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేయబోతున్నాడు అని తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ సిద్ధంగా ఉందట.

పోస్టర్ తోనే ఎన్టీఆర్ ను ఓ రేంజ్ లో చూపించాడట రాజమౌళి. అలాగే ఎన్టీఆర్ పాత్ర పరిచయానికి సంబధించిన ఎలివేషన్ షాట్స్ అండ్ ఎమోషనల్ కంటెంట్ అద్భుతంగా వచ్చిందని తెలుస్తోంది. ఇప్పటికే చరణ్ పుట్టినరోజు సందర్భంగా భీమ్ ఫర్ రామరాజు అంటూ వచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. మరి రామరాజు ఫర్ భీమ్ పేరుతో రాబోయే ప్రత్యేక వీడియోను ఫ్యాన్స్ ను ఏ రేంజ్ లో సర్ ప్రైజ్ చేస్తోందో చూడాలి.

ఇక ఎన్టీఆర్ ఈ సినిమాలో మొత్తం రెండు గెటప్స్ లో కనిపిస్తాడట. ఎన్టీఆర్ సీన్స్ అన్ని అద్భుతంగా వచ్చేలా రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. అన్నట్టు ఎన్టీఆర్ మీద చిత్రీకరించిన ఫైట్ సీన్ తాలూకు విజువల్ ఒకటి రీసెంట్ గా బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫైట్ అడవి పులికి, కొమురం భీమ్ పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ కు మధ్యన జరిగేది. ఈ పోరాట సన్నివేశంలో తారక్ లుక్ రివీల్ అయింది. మరి ఆ లుక్ లోనే సినిమా మొత్తం కనిపిస్తాడా లేక వేరే వేరియేషన్స్ కూడా ఉంటాయా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు