అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఫైట్స్ చేస్తున్న “బాద్షా”

అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఫైట్స్ చేస్తున్న “బాద్షా”

Published on Oct 26, 2012 3:45 PM IST


సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ “బాద్షా చిత్రం చాలా బాగా వస్తుంది అని తెలుస్తుంది. గత ఏడాది “దూకుడు” చిత్రం తరువాత అదే మాయాజాలాన్ని శ్రీను వైట్ల కొనసాగించాలని చాలా కష్టపడుతున్నారు. బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోన వెంకట్ మరియు గోపి మోహన్ కూడా ఈ చిత్ర బృందంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.ప్రస్తుతం ఈ చిత్రం గచ్చిబౌలిలో అల్యుమినియం ఫ్యాక్టరీ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక్కడ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఫైట్ చిత్రీకరిస్తున్నారు. కాజల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. మాఫియ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చాలా భాగం థాయ్ ల్యాండ్ మరియు యూరప్లో చిత్రీకరించారు. నవదీప్ కీలక పాత్ర పోషిస్తుండగా కెళ్ళి దోర్జీ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చ్ 28,2013 లో విడుదల కానుంది.

తాజా వార్తలు