చంద్రబాబు నాయుడుని పరామర్శించడానికి వెళ్ళిన ఎన్టీఆర్

చంద్రబాబు నాయుడుని పరామర్శించడానికి వెళ్ళిన ఎన్టీఆర్

Published on Oct 27, 2012 10:18 AM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇటీవల పాదయాత్ర ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నిన్న గద్వాల్ లో చంద్ర బాబు మాట్లాడానికి ఏర్పాటు చేసిన వేదిక అకస్మాత్తుగా కూలిపోయింది. బాబుని చూసేందుకు అక్కడికి వచ్చిన వారు ఒక్కసారిగా వేదిక మీదికి రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక చెక్క ముక్క అయనకి గుచ్చుకోవడంతో అయన స్వల్ప అస్వస్థతకి గురయ్యారు. ఈ రోజు అయన ఆరోగ్యాన్ని పరీక్షించిన డాక్టర్లు విశ్రాంతి అవసరం అని చెప్పడంతో ప్రస్తుతం అయన విశ్రాంతి తీసుకుంటున్నారు.

అయితే టీడీపీ పార్టీలో అండగా ఉంటూ 2009లో జరిగిన ఎన్నికల్లో పార్టీకి సపోర్ట్ ఇస్తూ ప్రచారంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు పాదయాత్రలో అస్వతతకి గురయ్యారని తెల్సుకుని ఈ రోజు జరగవలిసిన ‘బాద్షా’ షూటింగ్ నిలిపివేసి హుటాహుటిన గద్వాల్ బయలుదేరారు. ఎన్టీఆర్ తో పాటుగా బాద్షా చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల మరియు నిర్మాత బండ్ల గణేష్ కూడా ఆయనతో పాటుగా గద్వాల వెళ్లారు. చంద్రబాబు, ఎన్టీఆర్ మధ్య మనస్పర్ధలు ఉన్నట్లు ఈ మద్య వస్తున్న పుకార్లకు ఈ సంఘటనతో సమాధానం ఇచ్చినట్లైంది. చంద్రబాబు నాయుడు త్వరగా కోలుకుని తిరిగి పాదయాత్ర ప్రారంభించాలని కోరుకుందాం.

తాజా వార్తలు