ఎన్.టి.ఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్టైనర్

ఎన్.టి.ఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్టైనర్

Published on Oct 25, 2012 3:51 PM IST


యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కనుంది. ఈ సినిమా 2013 సెకండాఫ్ లో ప్రారంభమవుతుంది. టాలీవుడ్లో ఎంతగానో ఎదురు చూస్తున్న కాంబినేషన్లలో ఇది కూడా ఒకటి. వచ్చే సంవత్సరం సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాని డా. కె.ఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఈ సినిమాకి సంబందించిన స్టొరీ లైన్ ఓకే అయ్యింది కానీ ఇంకా పూర్తి స్క్రిప్ట్ సిద్దమవ్వలేదు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ మరియు త్రివిక్రమ్ వారి వారి సినిమాల్లో బిజీగా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇది వరకే ఒక టీవీ యాడ్ వచ్చింది. అభిమానులు మాత్రం వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. డా. కె.ఎల్ నారాయణ గతంలో ఎన్.టి.ఆర్ తో ‘రాఖీ’ సినిమాని నిర్మించారు.

తాజా వార్తలు