ఎన్.టి.ఆర్ నటనే నాకు స్పూర్తి – రానా

ఎన్.టి.ఆర్ నటనే నాకు స్పూర్తి – రానా

Published on Oct 28, 2012 3:55 PM IST


టాలీవుడ్ యంగ్ హంక్ రానా దగ్గుబాటి హీరోగా రానున్న సినిమా ‘కృష్ణం వందే జగద్గురుమ్’. ఈ సినిమా విజయం సాదిస్తుందని రానా చాలా నమ్మకంతో ఉన్నారు. బి.టెక్ బాబు పాత్ర పోషిస్తున్న రానా నాటకాలు వేస్తూ ఉంటాడు.ఈ సినిమాలో తన పాత్ర చేయడానికి రానా నందమూరి తారక రామారావు గారు నటించిన పౌరాణిక సినిమాలు చూసాను. ఎన్.టి.ఆర్ గారు చేసిన ‘దాన వీర శూర కర్ణ’ సినిమా నా మీద చాలా ప్రభావం చూపింది. ఈ సినిమాలో నరసింహ స్వామి, ఘటోత్కచుడు, అభిమన్యుడు మరియు తోట రాముడు వంటి పాత్రల్లో కనిపిస్తాను. ఇలాంటి పాత్ర నాకు దక్కడం చాలా ఆనందంగా ఉంది’ అని రానా అన్నారు. ఈ సినిమాలో నయనతార జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ అతిధి పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించనున్న ఈ సినిమాని దీపావళికి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు