నారా వారి అబ్బాయి సినిమా రిలీజ్ డేట్

నారా వారి అబ్బాయి సినిమా రిలీజ్ డేట్

Published on Oct 29, 2012 5:37 PM IST


నారా వారి అబ్బాయి నారా రోహిత్ హీరోగా, మళయాళ కుట్టి నిత్యా మీనన్ జంటగా రానున్న చిత్రం ‘ ఒక్కడినే’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాని నవంబర్ 23న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. శ్రీనివాస్ రాగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సి.వి రెడ్డి నిర్మించారు. యూత్ ని మరియు ఫ్యామిలీని ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్ర విజయంపై నిర్మాత పూర్తి నమ్మకంతో ఉన్నారు. కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఇటీవలే విడుదలైంది.

తాజా వార్తలు