అక్టోబర్ 27న పెళ్లి చేసుకోబోతున్న నాని

అక్టోబర్ 27న పెళ్లి చేసుకోబోతున్న నాని

Published on Oct 26, 2012 3:36 PM IST


టాలివుడ్ ప్రముఖ నటుడు నాని అక్టోబర్ 27న అంజన ఎలవర్తిని మనువాడబోతున్నారు. ఆగస్ట్ 12న వీరి నిశ్చితార్ధం జరిగింది గతంలో వీరి పెళ్లి నవంబర్లో జరుగుతుంది అని పుకార్లు వచ్చినా మాకు అందిన సమాచారం ప్రకారం వీరి పెళ్లి రేపే జరుగుతుంది.వీరు పెళ్ళికి పలువురు పరిశ్రమ పెద్దలు హాజరయ్యి వధూవరులను అశీర్వదించనున్నారు. నాని మరియు అంజన ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇదిలా ఉండగా నాని నటించిన “ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్రం నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదట్లో విడుదల కానుంది. అంత కాకుండా అయన కృష్ణవంశీ చిత్రంలో మరియు సముద్రఖని దర్శకత్వంలో “జెండా పై కపిరాజు” చిత్రంలో కనిపించనున్నారు. ఈ ఏడాది ఈ నటుడికి అన్ని కలిసోచ్చినట్టే కనిపిస్తుంది.

తాజా వార్తలు