డిసెంబర్ నుంచి ‘భాయ్’ అవాతరమెత్తనున్న నాగ్

డిసెంబర్ నుంచి ‘భాయ్’ అవాతరమెత్తనున్న నాగ్

Published on Oct 25, 2012 6:03 PM IST


‘కింగ్’ అక్కినేని నాగార్జున విరామం లేకుండా వరుస బెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. నాగార్జున హీరోగా తెరకెక్కాల్సిన కామెడీ ఎంటర్టైనర్ ‘భాయ్’ డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా ప్రారంభ పూజా కార్యక్రమాలు డిసెంబర్ మొదటి వారంలో జరగనుంది అలాగే అదే నెల నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ సంవత్సరం ‘పూల రంగడు’ సినిమాతో హిట్ కొట్టిన వీరభద్రం చౌదరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నాగ్ సరసన రిచా గంగోపాధ్యాయ కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమాని ఒకే షెడ్యూల్లో పూర్తి చేసి 2013 సమ్మర్లో విడుదల చేయడానికి ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని నాగార్జున తన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు