సాయి కుమార్ తో పోరాడనున్న రామ్ చరణ్?

సాయి కుమార్ తో పోరాడనున్న రామ్ చరణ్?

Published on Feb 9, 2012 1:06 AM IST

రామ్ చరణ్ సాయి కుమార్ తో పోరాడనున్నాడు అదేనండి వెండితెర మీద రామ్ చరణ్ రాబోతున్న చిత్రం “ఎవడు” చిత్రం లో ప్రతినాయిక పాత్రలో సాయి కుమార్ నటిస్తున్నట్టు సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో సమంత మరియు ఏమి జాక్సన్ ప్రధాన పాత్రల లో నటిస్తున్నారు. 2010 లో వచ్చిన ప్రస్థానం చిత్రం తో మళ్ళి ఒకసారి తన నటనను రుజువు చేసుకునున్న సాయి కుమార్ ఈ చిత్రం లో కూడా నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. ఈ చిత్రం లో అల్లు అర్జున్ చిన్న పాత్రలో కనిపించబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 23 నుండి చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది.

తాజా వార్తలు