త్వరలోనే ముగియనున్న మహేష్ గోవా ట్రిప్

త్వరలోనే ముగియనున్న మహేష్ గోవా ట్రిప్

Published on Oct 26, 2012 3:33 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర చిత్రీకరణ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. గత రెండు వారాలుగా గోవాలోని పలు అందమైన లోకేషన్లలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ షెడ్యూల్ నవంబర్ 1తో ముగియనుంది. కృతి సనన్ ఈ సినిమా ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్ మరియు డాషింగ్ గా కనిపించబోతున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర, గోపీచంద్ మరియు రామ్ ఆచంట కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సైకలాజికల్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్ర నిర్మాతలు ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. విజువల్స్ చాలా రిచ్ గా రావాలని ఈ సినిమాలో ఒక్క పాట కోసం సుమారు 3 కోట్ల రూపాయలతో ఒక సెట్ ని వేశారు. మహేష్ బాబు – సుకుమార్ – దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా వార్తలు