కృతితో రొమాన్స్ చేస్తున్న మహేష్ బాబు

కృతితో రొమాన్స్ చేస్తున్న మహేష్ బాబు

Published on Oct 29, 2012 1:57 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కృతి సనన్ ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను ప్రస్తుతం గోవాలో చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే ఒక పాట చిత్రీకరణ పూర్తి చేసిన ఈ చిత్రం టీం ఈ నెల చివరి వరకూ గోవాలోనే చిత్రీకరణ జరుపుకోనుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి విభిన్న ప్రేమకథా చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు మరియు ఇప్పటికే దేవీ శ్రీ అదిరిపోయే కొన్ని ట్యూన్స్ ఇచ్చారు. మహేష్ బాబు సరికొత్త లుక్ తో కనిపించనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 2013 మొదటి అర్ధ భాగంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి , ఇండస్ట్రీలో రికార్డ్స్ సృష్టించిన ‘దూకుడు’ సినిమాని కూడా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మించారు.

తాజా వార్తలు