‘మహావతార్ నరసింహ’ x ‘సలార్’.. దేవరతా రైసార్‌ను మెప్పించిన ఎడిట్..!

‘మహావతార్ నరసింహ’ x ‘సలార్’.. దేవరతా రైసార్‌ను మెప్పించిన ఎడిట్..!

Published on Aug 1, 2025 3:01 AM IST

Mahavatar Narsimha - Salaar

ప్రతిష్టాత్మకమైన హొంబలే ఫిలింస్ బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ యానిమేషన్ డివోషనల్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుండటంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

ఇక ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పలు రకాల ఎడిట్స్ వస్తున్నాయి. అయితే, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రానికి సంబంధించి ఈ సినిమాతో చేసిన ఓ క్రాస్‌ఓవర్ ఎడిట్ అద్భుతంగా ఉందని.. ఈ ఎడిట్‌కు సలార్ దేవరతా రైసార్ ప్రభాస్ సైతం ఇంప్రెస్ అయ్యాడని మేకర్స్ తెలిపారు.

ప్రభాస్‌ను ఆకట్టుకున్న ఈ ఎడిట్‌ను సలార్ మేకర్స్ తమ సోషల్ హ్యాండిల్స్‌లో పోస్ట్ చేశారు. ఇది చూసి రెబల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎడిట్ అంటే ఇలా ఉండాలి అంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు