టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన భారీ చిత్రమే “కింగ్డమ్”. మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్లోనే ఒక రికార్డు బ్రేకింగ్ ఓపెనర్ గా నిలిచింది. ఒక్క యూఎస్ మార్కెట్ లోనే కాకుండా కేరళ, తెలుగు రాష్ట్రాల్లోని సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది.
ఇక మేకర్స్ అధికారికంగా ఈ సినిమా మొదటి రోజుకి గాను ప్రపంచ వ్యాప్తంగా 39 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా ప్రకటించారు. అది కూడా ఒక నాన్ హాలిడేలో ఈ మొత్తం రావడం అనేది చిన్న విషయం కూడా కాదు. సో మొత్తానికి ఒక బిగ్గెస్ట్ ఓపెనింగ్ ని విజయ్ సాధించాడు అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.