టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ ఫీమేల్ లీడ్ లో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన చిత్రం “తమ్ముడు”. సీనియర్ నటి లయ టాలీవుడ్ కం బ్యాక్ ఇస్తూ చేసిన ఈ సినిమా ఊహించిన రీతిలో సక్సెస్ అందుకోలేదు.
అయితే ఈ సినిమా ఫైనల్ గా నెల లోపే ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా ఇందులో హిందీ మినహా అన్ని ముఖ్య భాషల్లో సినిమా అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఈ సినిమాకి దిల్ రాజు – శిరీష్ లు నిర్మాణం వహించగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.
తమ్ముడు రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి