‘కూలీ’తో ‘ఓజి’ బ్లాస్ట్!?

‘కూలీ’తో ‘ఓజి’ బ్లాస్ట్!?

Published on Aug 1, 2025 12:04 PM IST

OG-and-Coolie

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇంకా దేశ వ్యాప్తంగా అనేకమంది స్టార్ నటులు నటించిన అవైటెడ్ చిత్రమే “కూలీ”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సాలిడ్ చిత్రం పట్ల ఏ రేంజ్ హైప్ ఉందో మన టాలీవుడ్ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే దర్శకుడు సుజీత్ నుంచి వస్తున్న “ఓజి” పట్ల కూడా అదే రీతి హైప్ ఉందని చెప్పవచ్చు.

మరి ఆల్రెడీ కూలీ బుకింగ్స్ యూఎస్ మార్కెట్ లో అదరగొడుతుండగా ఈ ఆగస్ట్ 13న గ్రాండ్ ప్రీమియర్స్ కి సిద్ధం అయ్యింది. అయితే ఇదే ప్రీమియర్స్ తో ఓజి బ్లాస్ట్ కూడా ఉంటుంది అని ఇప్పుడు తెలుస్తుంది. దీనితో యూఎస్ మార్కెట్ లో కూలీ ప్రింట్ తో ఓజి గ్లింప్స్ ని కూడా అటాచ్ చేసి విడుదల చేస్తున్నారట. దీనితో థియేటర్స్ లో బ్లాస్ట్ అని చెప్పవచ్చు. ఇక లేటెస్ట్ గానే ఓజి ఫస్ట్ సింగిల్ పై కూడా మేకర్స్ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ కోసం ప్రస్తుతం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు