ప్రేమ పెళ్ళిళ్ళతో కలకలలాడుతున్న టాలీవుడ్

ప్రేమ పెళ్ళిళ్ళతో కలకలలాడుతున్న టాలీవుడ్

Published on Oct 28, 2012 1:37 PM IST


గత కొంత కాలంగా టాలీవుడ్ ప్రేమ వివాహాలతో కళకళలాడుతోంది. గత వారం మన టాలీవుడ్ యంగ్ హీరోలు అయిన ఉదయ్ కిరణ్ మరియు బ్రహ్మానందం కుమారుడి గౌతమ్ పెళ్లి జరిగింది. ఈ రెండు ప్రేమ వివాహాలే కావడం విశేషం. మనం గమనిస్తే గత కొంత కాలంగా టాలీవుడ్లో ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అల్లు అర్జున్ తన స్నేహితురాలు స్నేహలతని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అలాగే రామ్ చరణ్ తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనని పెళ్లి చేసుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం మంచు విష్ణు కూడా వెరోనికాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లో పెళ్ళికి రెడీగా ఉన్న యంగ్ హీరోలు ప్రభాస్, రానా, నాగ చైతన్య, మంచు మనోజ్, తరుణ్, నితిన్ మరియు రామ్. వీరందరిలో ఎంత మంది ప్రేమ వివాహాలు చేసుకుంటారో, ఎంత మంది పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారో అనే దాని కోసం మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు