దర్శకేంద్రుడి ‘ఇంటింటా అన్నమయ్య’

దర్శకేంద్రుడి ‘ఇంటింటా అన్నమయ్య’

Published on Oct 26, 2012 2:17 PM IST


ఇప్పుడున్న దర్శకులలో భక్తిరస చిత్రాలు చేసి మెప్పించగల దర్శకుడు కే. రాఘవేంద్ర రావు ఒక్కరే. అన్నమయ్య, శ్రీ మంజునాథ, శ్రీ రామదాసు, శిరిడి సాయి వంటి సినిమాలతో అందరినీ మెప్పించారు దర్శకేంద్రుడు. తాజాగా ఆయన ‘ఇంటింటా అన్నమయ్య’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే శ్రీ రామరాజ్యం వంటి సినిమాని నిర్మించి మంచి అభిరుచి కల నిర్మాతగా పేరు తెచ్చుకున్న యలమంచిలి సాయి బాబు గారి తనయుడు రేవంత్ ని ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నాడు. అనన్య, సనమ్ శెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకి దర్శకేంద్రుడి ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి స్వరాలు అందిస్తున్నాడు. విజయదశమి రోజున ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. వచ్చే ఏడాది వేసవిలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు