2020 చరిత్రలో అత్యంత దుర్భరమైన సంవత్సరంగా మిగిలిపోనుంది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమను కరోనా లాక్ డౌన్ చావు దెబ్బ కొట్టింది. థియేటర్స్ బంద్ కారణంగా కొత్త సినిమాల విడుదల ఆగిపోయింది. అలాగే రాబోయే సినిమాల షూటింగ్స్ కి బ్రేక్ పడింది. దీనితో నిర్మాతలకు ఆర్థిక కష్టాలు ఏర్పడడంతో పాటు సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇక దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరిగిపోతుంటే లాక్ డౌన్ ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు.
ఐతే ఇద్దరు మెగా హీరోల సినిమాలు.2020లో సందడి చేస్తాయి అనుకుంటే అది కరిగేలా కనిపించడం లేదు.పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ వచ్చే నెలలో విడుదల కావాల్సి ఉంది. కొంత భాగం షూటింగ్ మిగిలి ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది విడుదల కాదని అంటున్నారు. ఇక చిరంజీవి కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య దసరా కి విడుదల కావాల్సి వుండగా ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఆచార్య కూడా 2021కే షిఫ్ట్ అవుతుందని టాక్. 2021లో మెగా బ్రదర్స్ సందడి కష్టమే అంటున్నారు.