విశాల్ సినిమాకి ఇళయరాజా.!

విశాల్ సినిమాకి ఇళయరాజా.!

Published on Oct 26, 2012 3:32 PM IST


గతంలో కొద్ది రోజులు తన సంగీతానికి కాస్త విరామం ఇచ్చిన మాస్ట్రో ఇళయరాజా ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ కి సంగీతం అందిస్తూ బిజీ అయిపోతున్నారు. 2011లో ఆయన సంగీతం అందించిన ‘శ్రీ రామరాజ్యం’ చిత్రానికి గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు. గౌతం మీనన్ దర్శకత్వంలో రానున్న ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ పాటలు గత స్మృతుల్ని గుర్తుకు తెస్తూ, ఇప్పటి యువతని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఆయన సంగీతం అందించిన ‘గుండెల్లో గోదారి’ సినిమా ఆడియో గత వారమే విడుదలైంది. తాజా సమాచారం ప్రకారం విశాల్ హీరోగా తెరకెక్కనున్న తెలుగు సినిమాకి ఇళయరాజా సంగీతం అందించనున్నారు. ఈ సినిమా ద్వారా శశికాంత్ దర్శకుడిగా పరిచయం కానున్నారు.జి.వి కృష్ణ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్లో ప్రారంభం కానుంది. మిగతా వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

తాజా వార్తలు