ఆయనకి ఏమి కావాలో తెలుసుకొని అదే చేస్తాను.!

ఆయనకి ఏమి కావాలో తెలుసుకొని అదే చేస్తాను.!

Published on Oct 28, 2012 11:29 AM IST


మన హీరోయిన్లను ఏదైనా ఒక సినిమా చేస్తున్నప్పుడు సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది? అందుకోసం మీరు ఏమన్నా కష్టపడ్డారా? అని అడిగితే వెంటనే అవునండి నా పాత్ర చాలా కష్టమైనదే దానికోసం నేను చాలా హోం వర్క్ చేసాను, ఆ సినిమా చేసినన్ని రోజులూ ఆ పాత్రలోనే ఉండిపోయాను అనే సమాధానాలను ఎక్కువగా వింటుంటాము. ఇదే విషయాన్ని మన శ్రుతి హాసన్ ని అడిగితే ‘ నాకు నా మొదటి సినిమా ‘లక్’ నుంచి ఇప్పటివరకూ అన్నీ మంచి పాత్రలే దక్కాయి కానీ నేనెప్పుడూ హోంవర్క్ చెయ్యాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. ముందుగా కథను మరియు నా పాత్రని బాగా అర్ధం చేసుకొని మనసులో పెట్టుకుంటాను. దర్శకుడు నా నుంచి ఏమి కోరుకుంటున్నారో అది తెలుసుకొని దానికి తగ్గట్టుగానే నేను నటిస్తాను. సెట్లోకి వచ్చానంటే నా పాత్రలో లీనమైపోతాను, ఒక్కసారి డైరెక్టర్ ప్యాకప్ చెబితే మళ్ళీ సెట్లోకి వచ్చేంత వరకూ ఆ పాత్ర గురించి అస్సలు ఆలోచించాను. అలా ఎక్కువగా ఆలోచించి మనం ఎదో చెయ్యాలి అనుకుంటే ముందుగా అనుకున్న పాత్ర ఒరిజినాలిటీ దెబ్బ తింటుందని’ శృతి అన్నారు.

ప్రస్తుతం శ్రుతి హాసన్ ప్రభుదేవా దర్శకత్వంలో ఒక హిందీ సినిమాలో నటిస్తోంది. అలాగే తెలుగులో రవితేజ సరసన ‘బలుపు’అనే సినిమాకి అంగీకారం తెలిపారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలవుతుంది.

తాజా వార్తలు