‘వేదం’ సినిమా ద్వారా తెలుగు వారికి పరిచయమైన దీక్షా సేథ్ తన అందంతో తెలుగులో ప్రేక్షకులను సంపాదించుకున్నారు. కానీ ఆమె ఇప్పటివరకూ పలు చిత్రాల్లో నటించినా సరైన విజయాన్ని మాత్రం అందుకోలేదు. ఈ విషయం గురించి అడిగినప్పుడు దీక్షా మాట్లాడుతూ ‘ కెరీర్ కి విజయాలు కావాలి అని నేను ఒప్పుకుంటాను, కానీ అది నాకు వచ్చిన పాత్రల మీద ఆధారపడి ఉండదు. అదీకాక నేను ఇప్పటి వరకూ ఎక్కువగా సహాయ హీరోయిన్ గానే నటించాను, కావున సినిమా పరాజయానికి నేను పూర్తి భాధ్యురాలిని కాదు ఏమంటారు? ఈ విషయం నేను పనిచేసిన దర్శకులకి కూడా తెలుసు’అని ఆమె అన్నారు
నటన గురించి మీరు మాములుగా ఏమనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు దీక్షా సమాధానమిస్తూ ‘ నేను అందరిలాంటి అమ్మాయిని కాదు. నేను ఏ విషయానికీ భయపడను. నేను నా గతంలో చేసిన తప్పులని తెలుసుకొని వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను. ఎదుటివారు చెప్పే విషయాన్ని అంత తొందరగా వినను మరియు నేను ఎవరినీ అనుకరించను’ అని ఆమె అన్నారు. తన రాబోయే సినిమాలైనా తనకి విజయాన్ని అందించాలని ఆశిద్దాం.