‘వీరమల్లు’ కంప్లైంట్ పై మేకర్స్ అలర్ట్.. ఫిక్స్ చేస్తున్నారా?

‘వీరమల్లు’ కంప్లైంట్ పై మేకర్స్ అలర్ట్.. ఫిక్స్ చేస్తున్నారా?

Published on Jul 24, 2025 1:23 PM IST

Hari Hara Veera Mallu

రెండు తెలుగు రాష్ట్రాల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకులు క్రిష్ – జ్యోతి కృష్ణ తెరకెక్కించిన భారీ చిత్రం “హరిహర వీరమల్లు”. చివరి నిమిషం వరకు మంచి సస్పెన్స్ తోనే థియేటర్స్ లోకి సినిమా వచ్చింది. అయితే విడుదల అయ్యి ఆడియెన్స్ లో మంచి టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాలో ఒక్క గ్రాఫిక్స్ పనులు మాత్రం బాగా డిజప్పాయింట్ చేసాయి.

చూసిన ప్రతీ ఒక్కరూ కూడా ఈ అంశం కోసమే మొదట మైనస్ గా మాట్లాడుతున్నారు. అయితే ఈ ఫీడ్ బ్యాక్ మేకర్స్ వరకు వెళ్లినట్టుగా తెలుస్తుంది. దీనితో మేకర్స్ వీరమల్లు విఎఫ్ఎక్స్ ని ఫిక్స్ చేసి రిలీజ్ చేస్తారు అన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అప్డేట్ చేసిన వెర్షన్ ని మళ్ళీ థియేటర్స్ లో రీప్లేస్ చేస్తారని తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు